oil leak | న్యూశాయంపేట, ఏప్రిల్ 6 : హనుమకొండ హంటర్ రోడ్డులోని ఖమ్మం బ్రిడ్జి జంక్షన్ వద్ద సోమవారం ఉదయం 12:30 గంటల ప్రాంతంలో ఖమ్మం బ్రిడ్జి నుంచి భద్రకాళి చెరువులోని మట్టిని తరలించేందుకు హనుమకొండ వైపు వస్తున్న టిప్పర్ (టిజీ 24టీ 3579) జాకీ చాంబర్ పగిలిపోయింది. జంక్షన్ మూల మలుపువద్ద ప్రమాదవశాత్తు టిప్పర్ జాకీ చాంబర్ పగిలి రోడ్డుపై ఆయిల్ కారిపోవడంతో వెనుకగా వచ్చిన వాహన యజమానులు బెంబేలెత్తి పోయారు.
ఇద్దరు, ముగ్గురు ద్విచక్ర వాహనదారులు ఆయిల్ పారుతున్న రోడ్డుపై గమనించక వాహనం నడపడంతో జారి కిందపడి పోయారు. వీరికి స్వల్ప గాయాలుకావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. తక్షణమే స్పందించిన కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ఆయిల్ కారిన రోడ్డుపై వాహనాలు ప్రయాణం చేయకుండా బారీ కేడ్లను నిలువరించారు.
అనంతరం సమీపంలోని మట్టిని డోజర్ సహాయంతో రోడ్డుపై చల్లి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగుచర్యలు తీసుకున్నట్లు కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న, ఎస్ఐ సంపత్‌కుమార్ తెలిపారు. రోడ్డుపై ప్రమాదానికి గురై చికిత్సకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం