దామెర: మండల కేంద్రంలోని విత్తన షాపులతోపాటు ఊరుగొండ, కొగిల్వాయి గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి రాకేష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులలోని బిల్ బుక్స్, రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లులను తీసుకోవాలని సూచించారు. పంటకాలం అయిపోయే వరకు దుకాణదారులు ఇచ్చే రశీదులను రైతులు భద్రపరుచుకోవాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఈవోలు పాల్గొన్నారు.