ధర్మసాగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్చర్ ఫిల్లర్ మీద పడి లారీ డ్రైవర్(Lorry driver) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చెపూరి అనిల్ (33) లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కాగా, ఎలుకుర్తి శివారులో ఓ వెంచర్లోకి మట్టిని లారీలో తీసుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు వెంచర్‌కు చెందిన ఆర్చర్ ఫిల్లర్ లారీ పై పడడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ కుమార్ తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనిల్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.