chess tournament | హనుమకొండ చౌరస్తా, మార్చి 27: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-19 చదరంగం ఎంపిక పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
కన్నా
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. క్రీడాకారులు జనవరి 1, 2006 ఆ తర్వాత జన్మించినవారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన బాలురు నుంచి నలుగురు, బాలికలు నుంచి నలుగురిని ఎంపిక చేసి మే నెలలో హైదరాబాద్లో జరిగే రాష్ర్టస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. క్రీడాకారులు తమవెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలని, వివరాలకు 90595 22986 నందు సంప్రదించవచ్చని సూచించారు.