హనుమకొండ చౌరస్తా, మార్చి 12 : హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ శిక్షణ సంస్థ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో బీసీ విద్యార్థులకు(BC students) ఒక నెల పాటు నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.ఎంపీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రైవేటు బ్యాంకుల్లో ప్లేస్ మెంట్ కల్పిస్తారని ఆయన తెలిపారు. డిగ్రీ పూర్తయిన 26 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని ఆయన తెలిపారు.
ఈనెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు దరఖాస్తులను www.tgbcstudycircle.cgg.gov.in ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలని ఆయన తెలిపారు. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలలోపు ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఉంటుందని, పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా (30) మందిని ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం 040-29303130 ని సంప్రదించాలని ఆయన కోరారు.