హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: హనుమకొండ కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ (Chaitanya Deemed University)లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశవిదేశాల నుంచి వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో పలు రంగుల్లో బతుకమ్మలను పేర్చి విద్యార్థినులు, అధ్యాపకులు ఆడిపాడారు.
బతుకమ్మ వేడుకలను ఉద్దేశించి చైతన్య యూనివర్సిటీ ఛాన్సలర్ సీహెచ్.పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ సంస్కృతి సంప్రదాయాలను ముందుతరాలకు వారసత్వంగా అందించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గాదె రాంబాబు, డీన్లు పద్మ, అనురాధ, మహిళా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.