ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువులు, కుంటలకు సంబంధించిన విలువైన శిఖం భూములు కబ్జాలకు (Land Grabbing) గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నది. ఆక్రమణదారులకు అధికారులే అండగా ఉండి కబ్జాలకు సహకరస్తునారనే ఆరోపణలకు ఉన్నతాధికారుల ఉదాసీనత బలం చేకూరుస్తున్నట్లుందనే అభిప్రాయాలు సర్వతా వ్యక్తమవుతన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా జీవనాధారమైన గొలుసుకట్టు చెరువుల, కుంటలను ఎక్కడికక్కడ అక్రమార్కులు చెరబట్టారు. కబ్జారాయుళ్లు కోట్లాది రూపాయల విలువైన వందల ఎకరాల శిఖం భూములను కబ్జా చేశారు. చెరువులు, కుంటల ఊపిరి తీసి వాటి ఉనికిని ప్రశ్నార్ధకం చేశారు, ఎక్కడికక్కడ కుంటలు, చెరువులకు సంబంధించిన భూములు, కాలువలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రైతులు మొరపెట్టుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోంచుకోవడం. లేదని వివర్శలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వ కారణంగా చెరువులను, కుంటలను కబ్జా చేస్తున్నారు.
పున్నేల్ గ్రామంలోని బాబాయికుంట (తురక వారి కుంట) సర్వే నంబర్ 74,75,76,77,78,79,800 2 10 2 ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులలో నమోదు అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ చిన్న చెరువులు, కుంటలకు 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ కజ్జాదారులు మాత్రం తమకు ఏ నిబంధనాలతో సంబంధం లేదంటూ బాబాయికుంటలో అడ్డంగా ప్రహరీ గోడ నిర్మాణం చేసి దర్జాగా కబ్జా చేశారు. ఇది చాలదన్నట్లు కజ్జాదారులు కుంట తూము, మత్తడిని కూడా విడిచిపెట్టకపోవడం విడ్డూరంగా మారింది. కుంటలో అడ్డంగా గోడ కట్టడమే కాకుండా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే వెంచర్ చేశారు. వెంచర్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులకు గతంలోనే పెద్ద మొత్తంలోనే ముడుపు ముట్టి ఉంటాయని ఆరోపణాలు ఉన్నాయి. అదే కాకుండా నిబంధనాలకు విరూద్దంగా ఎఫ్టీఎల్, జఫర్జోన్కు అడ్డంగా గోడ కట్టి చేసిన వెంచర్లో భూములను వ్యవసాయ భూములుగా గుంటల ప్రకారం రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అంటే రెవెన్యూ అధికారులకు ఈ వెంచర్ యాజమానుల మధ్య ఎటువంటి సత్సంబంధం కొనసాగుతుందో చెప్పకనే చెప్పినట్లు అవుతుంది.
అధికారులు నిద్రవస్థలలో ఉండడంతో మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసి వెంచర్ యాజమనులు వరద కాలువను కజ్జా చేసి వెంచర్ చేసి దర్జాగా అమ్మకాలు చేశారు. అదే విధంగా వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి పైన ఏకశిలా ఇ టేక్నో స్కూల్కు సమీపంలో ఓ వెంచర్లో సైతం వరద కాలువ కజ్జా చేసి క్రమవిక్రయాలు చేస్తున్నారు. అయితే ఈ వెంచర్లలో భూముల కొనుగోలు చేసిన వారికి నిర్మాణాల కోసం అనుమతులు లభించడం ప్రశార్థకంగా మారింది. ఈ వెంచర్లకు ‘కుడా’ అధికారులు ఏ నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చారో ఉన్నతాధికారులు పరిశీలించాలని మండల వాసులు కోరుతున్నారు.
పంధిని గ్రామంలో సర్వే నంబర్ 126,127 అసైన్డ్ భూమిని వరంగల్ చెందిన ఓ బీజేపీ యువ నాయకుడు కొనుగోలు చేశాడు. రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో కొనుగోలు చేసిన భూమిలో హద్దురాళ్లు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు చేశాడు. జూన్ 6న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక జిల్లా ఎడిషన్లో ఎయిర్పోర్ట్ ఎరగా రియల్ దందా..! అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. అయితే సంబంధిత అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ అక్రమ వెంచర్లో హద్దు రాళ్లను తొలగించి మమా అనిపించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు అసలు అసైన్డ్ భూమిని (బదిలీ నిషేదం చట్టం) బదిలీ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. వాటిని తుంగలో తొక్కి ఏకంగా అక్రమ వెంచరు, భూమి చేతులు మారాడానికి రెవెన్యూ అధికారులు సహకరించారని ఆరోపణాలు వెల్లువెత్తాయి. మరోవైపు అసైన్డ్ భూమిలో నిర్మించిన ఇండ్ల అమ్మకాలకు సోషల్ మీడియాలోనే ప్రచారం చేయడం విడ్డూరంగా మారింది. అసైన్డ్ భూమి అని బెబుతూ కొనుగోలు చేసుకునే వారికి ఇంత రేటు అని ప్రచారం చేయడం అంటే.. రెవెన్యూ అధికారులు ఏ స్థాయిలో నిద్రవస్థలో ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పటికైన ఉన్నతాధికారులు ఐనవోలు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి చెరువు శిఖాలు, వరద కాలువు, అసైన్డ్ భూములను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
బాబాయికుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే నిర్మాణాలు, ఐనవోలు, పున్నేల్ వెంచర్లలో వరద కాలువ కజ్జా, పంతిని అసైన్డ్ ల్యాండ్ భూములలో అక్రమ వెంచర్లు చేసిన విషయం తన దృష్టికి రాలేదని, ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ అన్నారు. అసైన్డ్ భూమి అక్రమ వెంచర్, ఎఫ్ఎఎల్, బఫర్ జోన్, వరద కాలువ కజ్జా తదితర అంశాలపై ఇరిగేషన్, కుడా, రెవెన్యూ అధికారులం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి చర్యలు చేపడుతామని చెప్పారు.