భీమదేవరపల్లి, మే 31: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వాస్పత్రిలో శనివారం ప్రపంచ ధూమపాన నిషేధ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధూమపానం సేవించడం వల్ల కలిగే అనర్థాలను ప్రభుత్వ వైద్యాధికారిణి రుబీనా వివరించారు.
ముఖ్యంగా ధూమపానం సేవిస్తే క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయని రుబీనా తెలిపారు. ధూమపానం వల్ల కలిగే అనర్థాలను గురించి పాటల రూపంలో ఆశావర్కర్లు వివరించారు. అనంతరం గ్రామాల్లో ధూమపానం నిషేధించాలని ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.