K-Hub | కే-హబ్ ప్రారంభించాలని ఏబీవీపీ నిరసన
-హబ్‌ను వెంటనే ప్రారంభించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3: కాకతీయ యూనివర్సిటీలో కే-హబ్‌ను వెంటనే ప్రారంభించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ర్ట కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన కే-హబ్ వృథాగా మారిందని, . మూడేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారని, కేయూ వీసీ, రిజిస్ట్రార్ కే-హబ్ పేరిట కోట్ల రూపాయాల ధనం వృథాగా ఖర్చు చేశారని ఆయన మండిపడుతున్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా, ఆశించినస్థాయిలో కార్యకలాపాలు ఎందుకు ప్రారంభం కాలేదనే ప్రశ్నించారు. వర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ హయాంలో 50 కోట్ల ‘రుసా’ నిధులు మంజూరు కాగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో కే-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు గతంలో వెల్లడించారని, కే-హబ్ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా భవనం లోపల కొన్ని నిర్మాణాలను తొలగించి, హాళ్లు, గదుల్లో మార్పులు, మరమ్మతులు చేపట్టి అదనంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేయడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ యూనివర్సిటీ ఇంచార్జీ నిమ్మల రాజేష్, యూనివర్సిటీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, సాయికుమార్, పవన్‌కళ్యాణ్, కార్తీక్, ప్రణయ్, నందు, శివ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- ABVP protests
- Hanumakonda
- K-Hub
- ku
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

