సంగెం : వరగల్ జిల్లా సంగెం మండలం వంజర పల్లె గ్రామంలో ఎస్టీలు లేకున్నా సర్పంచ్ పదవిని ఎస్టీ రిజర్వేషన్‌గా ప్రకటించడం ప్రభుత్వ అధికారుల తప్పేనని సోమిడి శ్రీనివాస్ అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్య రాణిని కలిసి గ్రామస్తులు మెమోరాండం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం28- 9- 2025 రోజున ప్రకటించిన గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు వంజర పల్లె గ్రామపంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్‌గా ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో373 ఓటర్లు ఉన్నారు. ఎస్టీ కుటుంబాలే లేవన్నారు. దీంతో నామినేషన్ వేసే అభ్యర్థి లేనందున తక్షణమే ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ స్పందించి ఈ నోటిఫికేషను రద్దు చేస్తూ నూతనంగా నోటిఫికేషన్ ఇస్తూ ఎన్నికలు యధాతధంగా జరిగే విధంగా చూడాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి కోడగాని పెద్ద శంకర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కోడగాని సారంగం, గ్రామస్తులు నల్ల శ్రీనివాస్, పొన్నాల ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.