హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 26 : హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)మంగళవారం వెటరన్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ హాజరై మాట్లాడారు.
ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతిరోజు జేఎన్ఎస్లో క్రీడాపోటీలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, ఈ క్రమంలో మంగళవారం వాలీబాల్ పోటీలు నిర్వహించామని తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.