మొగుళ్లపల్లి,జూన్19 : ఫర్టిలైజర్ షాపుల్లో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరు నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు.
షాపులో అందుబాటులో ఉన్న విత్తనాలను పరిశీలించి రైతులకు అన్ని రకాల పురుగు మందులు, ఎరువులను, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. విత్తన చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో మండల వ్యవసాయాధికారి పి.సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.