హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 25 : కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెప్టెంబర్ 12న జరగబోయే మైక్రో బయోలజీ ఒక్కరోజు జాతీయ సెమినార్ కరపత్రాలను కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, కేడీసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ‘మైక్రోబియల్ ఫ్రాంటియర్స్, హార్నెసింగ్ జినోమిక్స్ సింథటిక్ బయోలజీ, మైక్రోబియమ్ ఇన్నోవేషన్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేయూ పరిధిలో ఈ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించడం ఇది ప్రథమమని ఇందుకు సదస్సు నిర్వహకురాలు పల్లవిని ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె.రజనీలత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.శ్రీనాథ్, కేయూ మైక్రోబయోలజీ బీవోఎస్ ఛైర్మన్ ముంజం శ్రీనివాస్, అధ్యాపకులు జె.చిన్నా, వాసం శ్రీనివాస్, డి.వెంకన్న పాల్గొన్నారు.