పర్వతగిరి : మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన శెట్టి రవళిక ఆదివారం కాళోజీ సాహితి పురస్కారం అందుకున్నారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో సాహితి వేదిక కన్వీనర్ సంగ శ్రీధర్, కో ఆర్డినేటర్ జొనగోని యాదగిరి, అతిధులు బోయిని ప్రతిభా భారతి, కటకం రాజేంద్రప్రసాద్, తుమ్మనపల్లి పూర్ణచందర్, కన్నె రాజు పాల్గొన్నారు.