RK Sagar | సోనియా గాంధీ ఇటలీలో పుట్టలేదా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై ఆర్కే సాగర్ ఫైర్
Jana Sena Leader | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Jana Sena Leader RK Sagar | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ అధ్యక్షతన రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు, తెలంగాణలో పుట్టి ఇక్కడే పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు. అసలు అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్థం కావడం లేదని, ఆయన మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి అనిరుధ్ రెడ్డికి లేదని, రాజకీయాల్లో ఆయన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనిరుధ్ రెడ్డి తన జీవితంలో ఎప్పుడైనా సొంత డబ్బులతో నియోజకవర్గ ప్రజలకు ఒక్క రూపాయి సహాయం చేశారా అని ప్రశ్నించిన సాగర్, పవన్ కళ్యాణ్ సమాజం కోసం చేస్తున్న సేవలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు జనసేనను విమర్శించడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తున్నారు.. మీకు సిగ్గుందా?
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన నేత RK సాగర్
తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి అనిరుధ్ రెడ్డి మతిస్థిమితం లేకుండా… https://t.co/4gAESZIZbM pic.twitter.com/r5qr0pVxN8
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

