వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 2 : కాకతీయ మెడికల్ కళాశాలలో డిసెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్కర్ష – 2022 పోస్టర్‌ను కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మోహన్‌దాస్ ఆవిష్కరించారు. శనివారం నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, ఇండోఅమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు హాజరుకానున్నట్లు తెలిపారు.
వేడుకల్లో భాగంగా 4న హెల్త్ రన్, ఫ్లాష్‌మాబ్, 5న సాహిత్య కార్యక్రమాలు, క్రీడలు, 6న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంపల్స్, 7న రక్తదాన శిబిరం, కార్నివాల్ నైట్, 8న ట్రెడిషనల్ డే, దాండియా నైట్, 9న ట్రెజర్ హంట్, మ్యూజికల్(ఈడీఎం) నైట్, 10న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.