కురవి, ఆగస్టు 25: కాంగ్రెస్ వస్తే యూరియా, కరెంటు ఉండద ని మాజీ సీఎం కేసీఆర్ చెప్పాడని, ఆయన చెప్పిందే నిజమైందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మం డల కేంద్రంలోని సొసైటీ ఎదుట రహదారిపై యూరియా ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆ ధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల గోస కాంగ్రెస్కు తగలకమానదన్నారు. 52వ సారి సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి పోయాడు. ఒకనాడైనా యూరియా సమస్యపై అడిగాడా? అని ప్రశ్నించారు. ఎరువుల సమస్యను డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఇకడి ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, సూర్యాపేటలో ఆపరేషన్లు తప్ప ప్రజలకు ఏం చేస్తున్నాడని ఆరోపించారు. డోర్నకల్ ప్రజలు చేసుకున్న ఖర్మ ఇదని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, రైతు లు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, నాయకులు బజ్జారి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవినాయక్, దొడ్డ గోవర్ధన్ రెడ్డి, నూతకి నర్సింహారావు, బోడ శ్రీను, బాదె నాగయ్య, సంగెం భరత్, బానోత్ రమేశ్, కిన్నెర మల్లయ్య, కొనతం విజయ్, నూతకి సాంబశివరావు, కృష్ణమూర్తి, మామిండ్ల వెంకన్న, పేర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.