Hanmakonda | హనుమకొండ (ఐనవోలు) : ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి తీవ్రమైన గాయాలతో మృతి చెందిన ఉన్న ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాతీయ రహదారి పున్నేల్ క్రాస్ సమీపంలో ఏకశిలా స్కూల్ దగ్గరలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మృతదేహన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి ఒంటిపైన సిమెంట్ రంగు ప్యాంట్, లేత నీలిరంగు, మెరున్ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్టు ధరించి ఉన్నట్లుగా తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసు స్టేషన్ నెంబర్ 8712685244, 8712685030కు సంప్రదించగలరి తెలిపారు. సదరు వ్యక్తి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.