HANAMAKONDA |హనుమకొండ చౌరస్తా, మార్చి 29: తెలుగువారి శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు నగర ప్రజలు సన్నద్ధమయ్యారు. హనుమకొండ చౌరస్తా, టైలర్స్స్ట్రీట్లో కొనుగోలుదారులతో సందడిగా మారింది. ప్రజలు పండగకు కావాల్సిన మామిడికాయలు, ఆకులు, పూలు, పచ్చడి కుండలను కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని వీధులు కిక్కిరిసిపోయాయి.