విహారం.. విషాదం
వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని పర్యా టక ప్రాంతానికి వచ్చిన మిత్ర బృందంలో తీరని శోకం మిగిలింది. అంతా కలిసి టూర్ ప్లాన్ చేసు కొని ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం లక్నవరం పర్యాటక ప్రాంతానికి చేరుకోగా, అందులో ఇద్దరికి అవే ఆఖరి గడియలుగా మారా యి
లక్నవరంలో మునిగి ఇద్దరి మృత్యువాత
ఆరుగురు స్నేహితులు కలిసి
సరదాగా గడిపేందుకు సరస్సు వద్దకు..
అందులో దిగే క్రమంలో గల్లంతు
మృతుల్లో యువతి, యువకుడు
హైదరాబాద్‌కు చెందిన ఇక్ఫై బిజినెస్ స్కూలు విద్యార్థులుగా గుర్తింపు
గోవిందరావుపేట, మే30: వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని పర్యా టక ప్రాంతానికి వచ్చిన మిత్ర బృందంలో తీరని శోకం మిగిలింది. అంతా కలిసి టూర్ ప్లాన్ చేసు కొని ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం లక్నవరం పర్యాటక ప్రాంతానికి చేరుకోగా, అందులో ఇద్దరికి అవే ఆఖరి గడియలుగా మారా యి. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌కు చెందిన ఇక్ఫై బిజినెస్ స్కూల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సోమవారం సాయంత్రం లక్నవరం సరస్సులోని రెండో ఐలాండ్‌లో ఉన్న కాటేజీని ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారు.
సా యంత్రం వేళలో సరదాగా గడిపేందుకు నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో సాయిప్రీతం(21), తరుణి (20) స్నేహితుల కళ్లముందే నీటముగిపోయి గల్లంతయ్యారు. దీంతో తోటి స్నేహితులు టూరి జం సిబ్బందికి సమాచారం అందించడంతో వా రు పస్రా సీఐ శంకర్, ఎస్సై కరుణార్రావు విష యాన్ని తెలిపారు. హుటాహుటిన సీఐ, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సా యంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో సాయిప్రీతం, తరుణి మృ త దేహాలను సరస్సు నుంచి ఈతగాళ్లు వెలికి తీశా రు. కాగా, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కార ణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

