గీసుగొండ, మే 9: కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండలంలోని కోనాయిమాకులలో స్త్రీశక్తి శానిటరీ న్యాప్కిన్స్ తయారీ యూనిట్‌ను మంగళవారం వారు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే డబ్బులు చెల్లించి న్యాప్కిన్స్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ డీఆర్డీఏ ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకొని న్యాప్కిన్స్ తయారు చేయడం గొప్ప విషయమన్నారు. రూ. 18 లక్షల ఖర్చుతో యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. గీసుగొండ యూనియన్ బ్యాంకు రూ. 9 లక్షల రుణం ఇచ్చిందని, ఇందులో ప్రభుత్వం 43 శాతం రాయితీని కూడా ఇస్తుందన్నారు. మహిళలు స్వయంగా ఎదిగేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా న్యాప్కిన్స్ అమ్మకాలు చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. బాలికల హాస్టళ్లకు న్యాప్కిన్స్ సరఫరా చేసేందుకు టెండర్లు పిలుస్తుందని, అందుటో స్వయం సహాయక సంఘాలు టెండర్లు దక్కించుకోవాలని సూచించారు.
అందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. మహిళలు కుట్టుమిషన్‌లో శిక్షణ తీసుకోవాని, టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేసిన కిటెక్స్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానున్నదన్నారు. అందులో 8 వేల మంది మహిళలకు ఉపాధి ఆవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం అందించే యూనిట్లతో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని మహిళలకు సూచించారు. డెయిరీఫామ్, కోళ్లఫామ్, నిత్యం ప్రజలకు అవసరమయ్యే వాటిని ఏర్పాటు చేసుకొని తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ న్యాప్కిన్స్ అమ్మకాలను ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హాస్టళ్లలో అమ్ముకునేలా అనుమతిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, తహసీల్దార్ విశ్వనారాయణ, ఎంపీడీవో వీరేశం, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ డోలి రాధాబాయి, ఎంపీటీసీ వీరారావు, డీపీఎం భవాని, అనిత, ఏపీఎం సురేశ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, యూనిట్ నిర్వాహకులు కొమాల, సుభాషిణి, కత్తి రమ, సర్పంచ్‌లు బోడకుంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి, నాగేశ్వర్రావు, పూండ్రు జైపాల్‌రెడ్డి, నాయకులు మంత రాజయ్య, చిన్ని, రమేశ్, రడం భరత్, రవీందర్‌రెడ్డి, మొగిలి, సంతోష్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పేదల ప్రభుత్వం..
బీఆర్ఎస్ పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట, మొగిలిచెర్ల, 16వ డివిజన్ గరీబ్‌నగర్ కాలనీకి చెందిన 96 మందికి జీవో నంబర్ 58 ప్రకారం కోనాయిమాకులలో ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గత ప్రభుత్వలు పట్టాలు ఇవ్వకుండానే రాజకీయాలు చేసి పేదలను మోసం చేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ పేదల పక్షాన నిలుస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీఆర్డీవో సంపత్‌రావు, తహసీల్దార్ విశ్వనారాయణ, ఎంపీడీవో వీరేశం, నాయకులు సుంకరి శివకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్ పాల్గొన్నారు.