ములుగు,అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని సమ్మక్క-సారలమ్మ కేంద్రియ విశ్వవిద్యాలయ లోగోను మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సమ్మక్క-సారలమ్మ ఆశయాలకు అనుగుణంగా యూనివర్సిటీ కొనసాగాలనే ఉద్దేశంతో లోగోను రూపొందించారు. తల్లుల వీరత్వం, గిరిజనులు, ఆదివాసీల సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు ప్రతిబింబించేలా లోగో రూపుదిద్దుకుంది. ఆవిష్కరణలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, యూనివర్సీటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ వైఎల్ శ్రీనివాస్, ఓఎస్డీ వంశీ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.