మహబూబాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాకు బుధవారం కేంద్ర బృందం రానున్నది. ఇటీవలి అతి భారీ వర్షాలు, వరదలతో జిల్లాలోని పలు గ్రామాలు నీట ముని గి, పంటలు కొట్టుకుపోయిన క్రమంలో నష్టాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి రెండు బృందాలు పర్యటించనున్నాయి.
మంగళవారం హైదరాబాద్కు చేరుకున్న ఈ బృందాలు బుధవారం ఉదయం నేరుగా ఖమ్మం, మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంటాయి. ఒక బృందం మరిపెడ మండలం ఉల్లెపల్లి, సీతారాంతండాలో పర్యటించనున్నది. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని, వరదలకు కొట్టుకుపోయిన జాతీయ రహదారిని పరిశీలించనుంది. రెండో బృందం డోర్నకల్ మండలంలోని ముల్కలపల్లి బ్రిడ్జితో పాటు వరదకు కొట్టుకుపోయిన పంట పొలాలు, తెగిన చెరువులను పరిశీలించనున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
వరదలతో అపార నష్టం..
జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 55 చోట్ల రోడ్లు దెబ్బతినగా, మరో 25 చో ట్ల రోడ్లు కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 18 కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది. తాతాలిక మరమ్మతులకు సుమారు రూ.2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చువువుతుందని అధికారులు అంచనా వేశారు. రోడ్లు భవనాలు శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 25 రహదారులు దెబ్బతినగా తాతాలిక మరమ్మతులకు రూ. 3 నుంచి రూ. 5 కోట్లు అవసరమని అంచనా వేశారు. జాతీయ రహదారుల శాఖ పరిధిలోని వివిధ రోడ్లు దెబ్బతిన్నాయి.
మరిపెడ మండలం పురుషోత్తమా యగూడెం బ్రిడ్జి వద్ద సుమారు పది చోట్ల రోడ్డు ధ్వంసమైంది. రెండు కిలోమీటర్ల మే ర రోడ్డు దెబ్బతినగా తాతాలిక మరమ్మతు ల కోసం రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అ లాగే జిల్లావ్యాప్తంగా 1,590 చెరువులు ఉం డగా. 127 చెరువులు దెబ్బతిన్నాయి. ఇం దులో 55 చెరువుల కట్టలు పూర్తిగా తెగిపోయాయి. మరో 72 చెరువులకు గండ్లు ప డ్డాయి.
సుమారు 50వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశా రు. వేల ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు వ చ్చి చేరాయి. మరో 30 వేల ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మకజొన్న, కూరగాయల పం టలకు నష్టం వాటిల్లింది. డోర్నకల్ మండ లం దుబ్బతండా, మరిపెడ మండలం సీతారాంతండా, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాలు నీట మునిగి ప్రజలకు నిలువనీడ లేకుండా పోయింది.