విప్లవ ధ్రువతార ఐలమ్మ
మెరిసే విప్లవ ధ్రువతార.. దొ రల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైంది.
- రజాకార్లను తరిమికొట్టిన ధీరురాలు
- ప్రజాపోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన యోధురాలు
- నేడు ఐలమ్మ 39వ వర్ధంతి
పాలకుర్తి, సెప్టెంబర్ 9 : మెరిసే విప్లవ ధ్రువతార.. దొ రల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైంది. తొలి భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజ యం సాధించింది. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.
చాకలి ఐలమ్మ పోరాట నేపథ్యం :
ప్రస్తుత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ-సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగయ్య ,లక్ష్మీనర్సయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమనర్సమ్మ జన్మించింది.
కాగా, 1921లో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఆంధ్రజన సంఘం మారిన పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. 1944లో భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యంతో భూమి, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయి. ఈ మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసింది.
పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలుకు తీసుకొని పండించిన పంట పొలాలపై విస్నూరు దేశ్‌ముఖ్ కిరాయి గూండాలు దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్న క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. కిరాయి రౌడీలను తరిమి కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలో రజాకార్లు ఐలమ్మ ఇంటిని తగులబెట్టి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆమె కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడగా, పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది అమరులు కాగా, మొత్తంగా 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. చివరకు 1985 సెప్టెంబర్ 10న ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది. కాగా, పాలకుర్తిలో ఐలమ్మ స్మారక భవనాన్ని ప్రజలిచ్చిన విరాళంతో సీపీఎం పార్టీ నిర్మించగా, అది నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆవిష్కరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

