కృష్ణకాలనీ, జూన్ 22 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కదలికలు కలకలం సృష్టిస్తున్నా యి. భూపాలపల్లి ఆటవీ రేంజ్ పరిధిలోని కమలాపూర్, రాంపూర్ అడవుల్లో ఆదివారం పులి సంచరించినట్లు తెలిసింది.
రెండు రోజుల క్రితం కొయ్యూరు పరిధిలోని ఎడ్లపల్లి అడవిలో ఓ ఆవుపై దాడి చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి కమలాపూర్ మీదుగా రాంపూర్ అడవిలోకి వెళ్లినట్లు అనుమానించిన అటవీ అధికారులు ఈ మేరకు పాదముద్రలు సైతం గుర్తించారు. కాగా, రాంపూర్, కమలాపూర్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అనుమానం ఉన్నందున ప్రజలు అటు వైపు వెళొద్దని రేంజ్ అధికారి నరేశ్ సూచించారు.