నమస్తే నెట్వర్క్ : తొలి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్లోని భద్రకాళీ, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంతో పాటు ఆయా మండలాలు, గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంతోపాటు తీర ప్రాంతంలో ప్రజలు పుణ్య స్నానాలాచరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టారు.