కన్నవాళ్లను కోల్పోయిన ఆ యువతులకు అన్నీ వారే అయ్యారు. చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అనాథలకు పెద్ద దిక్కై ముందుండి నడిపించారు. వారి పెళ్లి బాధ్యతలను సైతం తమ భుజాలపై వేసుకొని అందరికీ పెండ్లి పత్రికలు పంచారు. ఈ నెల 12న వారికి ఒకే వేదికపై అంగరంగ వైభవంగా వివాహం చేసేందుకు నర్సంపేటలోని మాతృభూమి చారిటబుల్ ట్రస్టు, సంజీవని ఆశ్రమం చైర్మ న్ డాక్టర్ అర్శనపెల్లి మోహన్‌రావు-వినోద దంపతులు ముహూర్తం నిర్ణయించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
– నర్సంపేట, మార్చి9
నర్సంపేట మండలం భోజ్యానాయక్‌తండా కు చెందిన పాపవత్ బిచ్యునాయక్-బుల్లె మ్మ దంపతులు అనారోగ్యంతో మృతి చెందగా, వారి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు 5, 6ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 2007లో ఆశ్రమంలో చేర్పించారు. వీరిలో పెద్దదైన రోజా అప్పటి నుం చి చక్కగా చదువుతుండేది. పండుగలు, సెలవు ల్లో వారికి ఆశ్రమమే పెద్ద దిక్కుగా ఉండేది. ప్ర స్తుతం బీటెక్ ఈసీఈ పూర్తి చేసి ఇప్పడిప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది.
ఈక్రమంలో మో హన్‌రావు దంపతులు ఆమెకు దూరపు బంధువులైన నర్సంపేటకు చెందిన బోడ అచ్చమ్మ-లక్ష్మణ్‌నాయక్ దంపతుల చిన్న కుమారుడు గణేశ్ తో వివాహం నిశ్చయించారు. అలాగూ చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన అందె వెంకటేశ్వర్లు-వరలక్ష్మి దంపతులు 2009లో అనారోగ్య కారణాలతో మృతి చెందగా, వీరి పెద్ద కూతురు అందె నాగరాణి తన చెల్లితో కలిసి 2009లో ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆమె ఏడేళ్లు ఉండగా, 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఆశ్రమంలో ఉంటూ చదువుకున్నది.
డాక్టర్ మో హన్‌రావు-వినోద దంపతులను తాత, అమ్మమ్మ గా ఊహించుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అయిన నర్సంపేటకు చెందిన నిమ్మల లక్ష్మి-కొంరయ్య దంపతుల చిన్న కుమారుడు రాకేశ్‌ను నాగరాణి ఇష్టపడడంతో వీరి పెళ్లి నిశ్చయించారు. ఈ ఇద్ద రు అనాథల వివాహాలు ఒకే ముహూర్తానికి ఒకే వేదిక మీద జరుగనున్నాయి. పట్టణంలోని సిటిజన్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో వేదపండితుల స మక్షంలో మాతృభూమి చారిటబుల్ ట్రస్టు, సం జీవని ఆశ్రమం ఆధ్వర్యంలో వీరి వివాహాలు జరుగనున్నాయి. పెళ్లి ఖర్చులు మొత్తం మోహన్‌రావు-వినోద దంపతులు భరించనున్నారు.
రోజా, నాగరాణి మా కండ్ల ముందు పెరిగారు. మా చేతుల మీదుగానే కొందరు దగ్గరి మిత్రుల సహకారంతో వీరి పెళ్లిళ్లు చేస్తు న్నాం. ట్రస్ట్, సంజీవని ఆశ్రమం డబ్బులు ఒక్క రూపాయి కూడా వినియోగించకుండానే వివాహాలు జరిపిస్తున్నాం. 2006లో 15 మంది విద్యా ర్థులతో ఆశ్రమం ప్రారంభించాం. ప్రస్తుతం 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అంతకు ముందు అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహించాం. విద్యతోనే అన్నీ సాధ్యమని గుర్తించి అనాథ పిల్లలను చేరదీసే క్రమంలో సంజీవని ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రూ. కోటి విలువ కలిగిన బిల్డింగ్స్ నిర్మాణం ఉంది. ఐదుగురు విద్యార్థులు బీటెక్ పూర్తి చేశారు. మరికొంత మం ది పాలిటెక్నిక్, ఐఐటీ చెన్నైలో ఉన్నారు. ఇటీవల సూర్యాపేట మెడికల్, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఈనెల 12న ఇద్దరు అనాథ అమ్మాయి ల పెళ్లికి అందరు వచ్చి ఆశీర్వదించాలి.
– డాక్టర్ అర్శనపెల్లి మోహన్‌రావు వినోద దంపతులు