గిర్మాజీపేట, ఏప్రిల్ 26: గ్యాస్ స్టౌ రిపేరు ముసుగులో చోరీలకు పాల్పడిన నిందితుడితోపాటు మరో ఇద్దరిని పోలీసు లు అరెస్ట్ చేశారు. వరంగల్ క్రైం ఏసీపీ డేవిడ్‌రాజు తెలిపిన వివ రాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెంది న పర్వతం రాజు(27) హైదరాబాద్‌లో నివాసం ఉంటూ గ్యాస్ స్టౌ మరమ్మతులు చేస్తూ జీవించేవాడు. వచ్చిన ఆదాయం జల్సాలకు, కుటుంబపోషణకు సరిపోకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను నమ్మించి ఆధార్‌కార్డ్ కావాలని చెప్పి వారు లోపలికి వెళ్లిన తర్వాత రహస్యంగా ఇంట్లోకి ప్రవే శించి బంగారు, వెండి ఆభరణాలు నగదు అపహరించేవాడు. రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనం చేసే వాడు. ఇతడిని పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పం పించారు. విడుదలైన నిందితుడు ఈ నెల రెండో తారీఖున దామెర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూరు గ్రామంలో వృద్ధురాలి గొలుసును దొంగిలించి పారిపోయాడు. ఇదే రీతిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు, ధర్మసాగర్, రా యపర్తి పరిధిలో రెండు, దామెర, ఐనవోలు, దేవరుప్పుల, మా మునూరు, స్టేషన్‌ఘన్‌పూర్, ఖానాపురం పీఎస్‌లలో ఒకటి చొ ప్పున చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొత్తును యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు ప్రాంతానికి చెందిన చింత కింది రాములు, ఆలేరుకు చెందిన గోవింద్చౌదరి వద్ద తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేవాడు. వరుస నేరాలపై అప్రమత్తమైన సీసీ ఎస్ పోలీసులు టెక్నాలజీ ఆధారంగా నిందితుడు రాజుతోపాటు చింతకింది రాములు, గోవింద్ చౌదరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 21.5 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి ఆభర ణాలు, రూ. 15,800 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైం డీసీపీ మురళీధర్, ఏసీపీ డేవిడ్‌రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేశ్ కుమార్, ఎస్సైలు యాదిగిరి, బాబూరావు, ఏఎస్సై శివకుమార్, దామెర ఎస్సై రాజేందర్, హెడ్‌కానిస్టేబుళ్లు అంజయ్య, రవికు మార్, వేణుగోపాల్, జంపయ్య, కానిస్టేబుళ్లు వంశీ, చంద్రశేఖర్, సూర్యప్రకాశ్, వినోద్‌ను సీపీ రంగనాథ్ అభినందించారు.