హనుమకొండ చౌరస్తా, జులై 18: కాకతీయుల కాలం నాటి స్టేషన్ ఘనపూర్ పల్లగుట్ట రోడ్డుకుగల వైరావగుట్ట తలకాయలగుట్ట(బైరవగుట్ట)పై ఎంతో మహామహిమగల వైద్యనాదాస్వామి దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, భక్తులు సహకరించాలని ఆలయ నిర్వాహకుడు భూనీటి కిషన్‌రెడ్డి విజ్ఞప్తు చేశారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షాలు పడాలని సోమవారం నుంచి స్వామివారిని వేడుకొని ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి స్వామివారి భవ్యమందిర నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోకుల శ్రీనివాస్, ఎగనుమదాసానంద, భూక్య ఎగరిలాలి, చిర్ర వెంకటేశ్వర్లు, తెగువల్ రమేష్, గోనీల శివకృష్ణ, గోనీల పాండు, గోనీల జీవంతో, గుగులోతు పాండు పాల్గొన్నారు.