ములుగుటౌన్, ఫిబ్రవరి10 : సమాచార హకు చట్టం సామాన్యుల వజ్రాయుధమని రాష్ట్ర సమాచార హకు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్‌నాయక్ అన్నా రు. ములుగు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్వో రమాదేవి, డీఎంహెచ్‌వో అప్పయ్యతో కలిసి ఆయన పలు అంశాలపై చర్చించా రు. కార్యాలయాల్లో అధికారులు సమాచార బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార హకుచట్టం ప్రకారం నెల రోజుల్లో ఫిర్యాదు దారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ సమాచారం ఇవ్వలేని పక్షంలో సదరు వ్యక్తులకు తెలుపాలన్నారు. లేకుంటే అప్పిలేట్ అధికారి విచారణ చేపట్టి సమాచారం ఇవ్వాలన్నారు.
అప్పిలేట్ అథారిటీ పరిషారం చేయనిపక్షంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీల పేర్లు, హోదా, ఫోన్ నంబర్ల వివరాలతో బోర్డులు ఏర్పా టు చేయాలన్నారు. కరోనా సమయంలోనూ ఫోన్ ద్వారా దరఖాస్తుదారులకు పరిష్కారం చూపామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 39వేల కేసుల్లో 34 వేలకు పైగా కేసులను, ములుగు జిల్లాలో 140 అప్పిళ్లకు 90 పరిషరించామని వివరించారు.