హనుమకొండ, అక్టోబర్ 14 : విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయం నుంచి అన్ని సరిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్ల(టెక్నికల్)తో సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రతి ట్రాన్స్ఫార్మర్పై టోల్‌ఫ్రీ నంబర్లు 1800 4250028, 1912 ముద్రించాలని చెప్పారు.
సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్లను వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. లూజ్ లైన్లు, వంగిన, తుప్పు పట్టిన, కాలం చెల్లిన స్తంభాలు, తకువ ఎత్తులో ఉన్న డీటీఆర్ ప్లింత్లు, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్, డబుల్ సర్యూట్, ఇండక్షన్ ఎఫెక్ట్ వచ్చే వాటిని గుర్తించాలని ఆదేశించారు. వీటన్నింటిని గుర్తించి పరిషరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని డిసెంబర్ నెలాఖరులోగా విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని స్పష్టంచేశారు.
ప్రమాదాల నివారణకు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం) స్టాఫ్‌తో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుందని సీఎండీ తెలిపారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు, భద్రత, జాగ్రత్తల విషయంలో రైతులకు అవగాహన పెంపొందించేందుకు అధికారుల పొలంబాట కార్యక్రమం చేపట్టామని, ఇందులో కరెంటు సరఫరా, వోల్టేజ్, వ్యవసాయ మోటర్లకు సంబంధించిన విషయాలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నదని సీఎండీ తెలిపారు. వీసీలో ఇన్చార్జి డైరెక్టర్ (హెచ్ఆర్డీ) బీ అశోక్‌కుమార్, ఇన్చార్జి డైరెక్టర్ (ఆపరేషన్) టీ మధుసూదన్, సీజీఎంలు కిషన్, అశోక్, జీఎం గౌతమ్‌రెడ్డి, డీఈ టీ శ్రీధరాచారి పాల్గొన్నారు.