హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : 50 సంవత్సరాల క్రితం 1974-75లో హనుమకొండలోని ప్రభుత్వ ఎల్బిహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ ఎస్సై జి. నర్సయ్య ఆధ్వర్యంలో ఆదివారం పాఠశాల ఆవరణలో కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమరువేసుకొని ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. వారికి విద్యను అందించిన ఉపాధ్యాయులైన పాండురంగా చారి, ఐలయ్యలను ఘనంగా సన్మానించారు.
పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులైన జగన్, వెంకటేశంలను సత్కరించారు. ఎల్ బి హెచ్ ఎస్ పాఠశాల లో ప్రస్తుతం విద్యార్థులు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని వాటర్ సంపును నిర్మించేందుకు వారు ఆర్థికంగా సహకరించి సంపు నిర్మాణాన్ని ప్రారంభించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి దూరప్రాంతాలైన నెల్లూరు, కాకినాడ, హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ఏటూరు నాగారం, ములుగు ల నుండి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో పరిటాల సుబ్బారావు, సత్య సుబ్రహ్మణ్యం, రమేష్ 40 మందికి పైగా పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.