కాంగ్రెస్ పాలనలో.. అభివృద్ధికి నోచుకోని ‘తూర్పు’
కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ మున్నూరుకాపు వాడలో ఆదివారం కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్తో ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
- ఆజంజాహీ మిల్లును అమ్ముకున్నరు
- సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు
- పది వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం : ఎమ్మెల్యే నన్నపునేని
- కోటలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరికలు
- మెట్టు దర్వాజ వద్ద ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
- ‘కారు గుర్తుకే మన ఓటు’ నినాదంతో దద్దరిల్లిన కోట
ఖిలావరంగల్, నవంబర్ 5: కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ మున్నూరుకాపు వాడలో ఆదివారం కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్తో ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు రెండు వేల మందితో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీలో చేరుతున్న నాయకులు, ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు మెట్టు దర్వాజ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు కిలో మీటర్ల పొడవునా కొనసాగిన ర్యాలీలో కారు గుర్తుకే మా ఓటు.. జై నరేందరన్న అంటూ చేసిన నినాదాలతో కోట దద్దరిల్లింది. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన నాయకులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే అజంజాహి మిల్లును అమ్ముకున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పారు ఏర్పాటు చేసి, మూడు కంపెనీలు నెలకొల్పారని, తూర్పు నియోజకవర్గానికి పది వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. అన్ని వర్గాల సంక్షేంమం కోసం సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారన్నారు. మన భవిష్యత్ కోసం వరంగల్ నగరంలో కలెక్టరేట్, ఆధునిక బస్‌స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మారెట్, ఇన్నర్ రింగ్‌రోడ్, ఏడు గురుకుల పాఠశాలలు, 24 అంతస్తుల హాస్పిటల్.. ఇలా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు ఖిలావరంగల్‌లో విద్య, వైద్యం, తాగునీరు, కమ్యూనిటీ భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు ఎందుకు పూర్తి చేయాలేదని ప్రశ్నించారు. మోసపూరిత ప్రచారాలతో వచ్చే నాయకులు అగడ్త రోడ్డు వేయించామని చెప్పుకుంటున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామ న్నారు.
కూరగాయల మారెట్లో మన ఖిలావరంగల్‌కు చెందిన రైతులు అమ్ముకునే అవకాశం కల్పించామన్నారు. మన నియోజకవర్గంలోని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో 110 రోజులపాటు ఉచితంగా కోచింగ్, భోజనం, మెటీరియల్ అందించానని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో 25 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. పడమర, మధ్య కోటను అభివృద్ధి చేశానని, వాటర్ ట్యాంక్ ఏర్పాటు ఒకటి మిగిలి ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒకరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన కొప్పుల క్రాంతి, పద్మ, ఆకుల వెంకటేశ్వర్లు, సుంకరి రాజు, బోనగోరి నరేశ్, రంజిత్, బొల్లం తిలక్, హరిప్రసాద్, హరీశ్‌తోపాటు సుమారు 80 కుటుంబాలు నన్నపునేని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

