హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18 : కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగానే ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ‘తెలంగాణ సైన్స్ కాంగ్రెస్-2025’ నిర్వహిస్తున్నట్లు కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం కామర్స్ విభాగం సెమినార్ హాల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వాహకులు నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ అకాడమిక్, పరిశోధన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధే ప్రధానంగా ఈ స్వర్ణోత్సవాలను ఈ నెల 19 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 19 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి మాజీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి (సలహాదారు, రక్షణ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం) ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
యువభారత్ కోసమే శాస్త్రసాంకేతికత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 9 గం టలకు కేయూ ఆడిటోరియంలో ప్రారంభ సమావే శం జరుగుతుందని, వీసీ, టీఎస్సీ-2025 చైర్మన్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు. ఇందులో 65 ఇన్వైటెడ్ టాక్స్, ఐదుగురు సీనియర్ ప్రొఫెసర్లు, జాతీయ ల్యాబ్స్ డైరెక్టర్లు, రెండు ప్లీనరీ సెషన్స్‌ల్లో మాట్లాడుతారని, 750 పరిశోధనా పత్రా లు వచ్చాయని, 626 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. పాఠశాల విద్యార్థుల కోసం శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్, ప్రాజెక్టుల ప్రదర్శన వంటి కార్యక్రమా లు సైతం ఉంటాయన్నారు.
దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిషరణ ముఖ్యమైందని, హై సూల్ విద్యార్థులను ప్రేరణ కలిగించేలా సైన్స్ కాం గ్రెస్‌లో అనేక కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతాయని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ (జనరల్ సెక్రటరీ, టీఏఎస్, మాజీ వైస్-ఛాన్స్లర్,ఓయూ), ప్రొఫెసర్ వల్లూరి రాం చంద్రం(ఎగ్జిక్యూటివ్ కన్వీనర్, టీఎస్సీ, రిజిస్ట్రార్, కేయూ), ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, ప్రొఫెసర్లు నర్సింహాచారి, మల్లికార్జునరావు, వరలక్ష్మి పాల్గొన్నారు.