హనుమకొండ, జూన్1: ‘ప్రజా ఉద్య మ ఫలితమే స్వరాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి కొట్లాడిండు. సకల జనులను ఏకం చేసి గమ్యాన్ని ము ద్దాడిన మహా నాయకుడు కేసీఆర్’ అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఒకేఒకడుగా బయలుదేరి అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దకుతుందన్నారు.
రాష్ర్టాన్ని పదేండ్లలో దేశంలోనే అగ్రభాగన నిలిపిన గొ ప్ప పరిపాలన దక్షుడు కేసీఆర్ అని కొనియా డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు 420 హామీ లు, 6 గ్యారెంటీలు ఇచ్చింది కానీ ఈ 18 నెలల కాలంలో ఏ ఒక హామీని పూర్తిస్థాయిలో అమలు చేసి న పాపాన పోలేదని దుయ్యబ ట్టారు. కాంగ్రెస్ హామీలు అమలు చేసే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హ యాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజే పీలు పార్టీ ద్రోహం, దగా చేశాయన్నారు.
ప్రజలు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నా రని తెలిపారు. గాంధీ, అంబేదర్ మార్గాల్లో నాడు ఉద్యమాన్ని, ఆ తర్వాత ప్రభుత్వాన్ని కేసీఆర్ నడిపారని, ఆయన హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండే జెండాగా ముందుకుపోయాయని, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ పదేండ్ల పాలనలో ఏనాడూ తెలంగాణకు ప్రత్యేక నిధులు మం జూరు చేసిన పాపాన పోలేదని ఆయన పేర్కొన్నారు. విభజన హా మీలను కూడా అమలు చేయకుండా తుంగలో తొకిందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు తెచ్చిన నిధులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చిరువ్యాపారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రామగ్రామాన జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండాను ఎగరవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల్లోనే ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసము ద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా మాజీ రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హాజరవుతారని తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సంకు నర్సింగ్, ఇమ్మడి లోహిత, నల్లా స్వరూపారాణి, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు ఇమ్మడి రాజు, వీరేందర్, రఘు, చాగంటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.