హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 14 : వరంగల్ నిట్ సాంకేతిక మహోత్సవానికి రెడీ అవుతున్నది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టెక్నోజియాన్’ను ఈ నెల 24, 25 తేదీల్లో ఘనం గా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. 2006 నుంచి నిట్ నూతన ఆవిష్కరణలకు నాంది ప లుకుతున్నది. దేశవ్యాప్తంగా 7 వేల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. ఈ ఏడాది టెక్నోజియాన్-25 సృజనాత్మకత ఆవిషరణల సరిహద్దులను మరింత విస్తరించబోతున్నది. రూ.2 లక్షల విలువైన బహుమతి నిధితోపాటు, రెండు రోజులపాటు ఉత్సాహభరితమైన పోటీలు, సాంకేతిక ప్రదర్శనలు, విభిన్న ఈవెంట్లతో నిం డి ఉండే ఉత్సవం, సాంకేతిక పురోగతిని వేడుక గా జరుపుకోనున్నారు. మరిన్ని వివరాలకు htt ps://technozion.nitw.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.
టెక్నోజియాన్లో భాగంగా విద్యార్థులు వివి ధ రకాల ఈవెంట్లతో ఆకట్టుకోనున్నారు. కోడ్ రెడ్, ప్రాజెక్టు ఎక్స్పో, ది లాంచ్పాడ్, బ్లేజ్(వెల్కమ్ టు ది బార్డర్ ల్యాండ్స్), నియోన్ క్రికెట్, గెస్టోర్ డ్రిఫ్ట్, వీరేంద్ర అధికారి ఫొటోగ్రాఫీతో పాటు పలు ఈవెంట్లను ప్రదర్శించనున్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి రూ.2 లక్షల ప్రైజ్మనీ కూడా అందజేయనున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల నిట్, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొని రెండురోజుల పాటు సందడి చేయనున్నారు.