వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట(Wardhannapet) కోనారెడ్డి చెరువు ఆక్రమణకు గురైందని అందిన వరస ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. కోనారెడ్డి చెరువు మత్తడి, ఎఫ్ టి ఎల్ భూభాగాన్ని రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ప్రభుత్వ చెరువు శిఖం భూములను ఎవరు ఆక్రమించేందుకు యత్నించినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్ హెచ్చరించారు.
చెరువు భూములు కబ్జా జరిగాయా లేదా అనే విషయంపై సర్వే కొనసాగుతోందని ఈ సందర్భంగా తహసీల్దార్ స్పష్టం చేశారు. మొత్తం కోణారెడ్డి చెరువు 478 ఎకరాల 6 గుంటలు ఉండాలి.. అయితే సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.