బచ్చన్నపేట జూన్ 10 : మండలంలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోఅంగన్వాడీ సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడేళ్లు పైబడిన చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు.
కేంద్రంలో చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు, ఆట పాటలతో కూడిన విద్య అందిస్తారని తెలిపారు. చిన్నారులకే కాకుండా, గర్భిణిలు, బాలింతలకు కూడా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. పిల్లల తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.