ములుగు, నవంబర్ 21(నమస్తేతెలంగాణ)/ ఏటూరునాగారం/ భూపాలపల్లి రూరల్/మహబూబాబాద్ రూరల్ : ములుగు జిల్లా ఎస్పీగా 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత 20 నెలలుగా ఇక్కడ పనిచేసిన డాక్టర్ పీ శబరీశ్‌ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.
గతం లో సుధీర్‌రామ్ నాథ్ కేకన్ 15 నెలల పాటు ములుగు ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. అదేవిధంగా ఏటూరు నాగా రం ఏఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయకు పదోన్నతి కల్పించి ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్స్ వి భాగంలో ఏఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గ్రే హౌండ్స్‌లో ఏఎస్పీగా పనిచేస్తున్న మనన్భట్ను నియమించారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్‌ను నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన కిరణ్ ఖరేను హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేశారు. సంకీర్త్ గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన తర్వాత రాష్ట్ర గవర్నర్ ఏసీడీగా భాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోషన్ పొంది నేడు భూపాలపల్లి ఎస్పీగా వచ్చారు.