హనుమకొండ చౌరస్తా : విద్యార్థులు బోధన సామర్థ్యం, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకి వెళ్లాలని కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి (OSD Venkatramireddy ) అన్నారు. కేయూ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జూనియర్ లెక్చరర్ల నియామక డ్రైవ్‌ను సెమినార్ హాల్లో నిర్వహించారు.
దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటైన రాజస్థాన్‌లోని కోటకు చెందిన రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జూనియర్ లెక్చరర్ల నియామక (క్యాంపస్ డ్రైవ్) కార్యక్రమం నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలకు చెందిన మొత్తం 60 మంది ఫైనలియర్ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు డెమో తరగతులు నిర్వహించి వారి బోధనా నైపుణ్యాలను పరిశీలించారు.
అనంతరం సంస్థ హెచ్ఆర్ ప్రతినిధులు తుది ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 32 మంది విద్యార్థులను జూనియర్ లెక్చరర్లుగా ఎంపిక చేశారు. వీరికి నెలకు రూ.30 వేలు ఇస్తామని సంస్థ తెలంగాణ ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేయూ ఓఎస్డీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బోధనా సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ విభాగం హెచ్‌వోడీ భార్గవిశర్మ, ఫిజిక్స్ హెచ్‌వోడీ పద్మజ, రెజోనెన్స్ సంస్థ హెచ్ఆర్ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.