హనుమకొండ, అక్టోబర్ 14: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జంక్షన్లో రోడ్డుపై బైఠాయించి వెంటనే పెంచిన డిగ్రీ ఫీజులను తగ్గించాలని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు పాత పద్ధతిలోనే ఫీజులు రిజిస్ట్రేషన్‌కు రూ.80, ఇతరాంతర యూనివర్సిటీ ఫీజు లాంటివి రూ.1300 తీసుకునే వారన్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తీసుకుకోవాలన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువును అభ్యసిస్తారన్నారు. వారికి అంతపెద్ద మొత్తం యూనివర్సిటీ పెంచిన రూ.3,250 ఫీజులు కట్టలేని కుటుంబాలు ఉంటాయని, తక్షణమే యూనివర్సిటీ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫీజులు తగ్గించకపోతే పెద్దఎత్తున విద్యార్థులతో యూనివర్సిటీ పరిపాలన భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్‌యూనియన్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు చెట్టుపల్లి శివకుమార్, కార్యదర్శి ఉల్లే రావుబాన్ని, రాజ్‌కుమార్, నాగరాజు, కార్తీక్, శ్రీరామ్, చరణ్, మహేష్, పవన్, సునీల్, శ్రావణ్, యశ్వంత్, గణేష్, శ్రీనాథ్, కీర్తన, లయకరి, న్సీ, నవ్య, శృతి, యశ్వంతి, శాలిని, రవళి, బిందు పాల్గొన్నారు.