నల్లబెల్లి, మార్చి 21 : పదవ తరగతి పరీక్షలు నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. కారుణ్య జ్యోతి పరీక్ష కేంద్రానికి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ జతో పాటు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కుమారస్వామి పర్యవేక్షణలో రెండు సెంటర్లకు గాను 354 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్ కు తావు లేకుండా ఎస్ఐ గోవర్ధన్ పరీక్ష సెంటర్ల వద్ద పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ఉదయం 8 నుండి 12:30 వరకు మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ముందస్తుగా ఎస్సై నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా పరీక్షలు రాసేలా ఎంఈఓ అనురాధ విద్యార్థులకు ముందస్తుగా అవగాహన కల్పించారు.