పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 25: ఆనాటి సం స్కృతి, సంప్రదాయాలను నాటకాలు కాపాడుతున్నాయని మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, ఎఫ్డీసీ సౌజన్యంతో మూడు రోజులు నిర్వహిస్తున్న పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవాలు గురువారం ముగిశాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, విశిష్ట అతిథులు శ్రీరామోజు సుందరమూర్తి, అడిషనల్ ఎస్పీ నల్లమల రవి, ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు గట్టు మహేశ్‌బాబు, పందిళ్ల రమేశ్‌బాబు, ఆకుల శ్రీకాంత్, ఆకుల సదానందం, వనం లక్ష్మీకాంతారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ శేఖర్‌బాబును స్మరించుకుంటూ ఏటా నాటకాలను ప్రదర్శించడం హర్షనీయమన్నారు.
పూర్వం నాటకాల ద్వారా రామాయణ, మహాభారత ఇ తివృత్తాలను తెలుసుకునే వారమన్నారు. ప్రస్తు తం వ్యయప్రయాసాలను లెక్కచేయకుండా కష్టపడుతున్న కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. రామోజు సుందరమూర్తి మాట్లాడుతూ దాతలు తగిన సహాయ సహకారాలు అందిస్తూ నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటు డు, దర్శకుడు బీఎం రెడ్డికి పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పురస్కారాన్ని అందజేశారు.
చివరి రోజు ప్రదర్శనలు..
చివరి రోజు విజయవాడ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక ను ప్రదర్శించారు. సుఖమంచి కోటేశ్వర్రావు రచన, దర్శకత్వం వహించగా, రామోజు సుందరమూర్తి పారితోషికం అందజేశారు. కర్నూలు టీ జీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జగదేక సుందరి సా మ పద్య నాటకాన్ని ప్రదర్శించారు.
విద్వాన్ పత్తి ఓబులయ్య రచన, దర్శకత్వం వహించగా, పారితోషికాన్ని బీ మహేందర్‌రెడ్డి, గట్టు మహేశ్బా బు అందజేశారు. కార్యక్రమంలో కార్యవర్గ స భ్యులు దేవరాజు రవీందర్‌రాజు, మాడిశెట్టి రమే శ్, వనపర్తి రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, సీతా వెంకట్, జూలూరు నాగరాజు, సంజీవరావు, ఓ డపల్లి చక్రపాణి, అటికం రవీందర్, నేరెళ్ల శోభారాణి, ఎం సదానందాచారి, వనం లక్ష్మీకాంతారావు, పందిళ్ల అశోక్‌కుమార్ పాల్గొన్నారు.