హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2 : హనుమకొండ జేఎన్‌ఎస్‌లోని బాక్సింగ్‌హాల్‌లో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలికల అండర్-17, 19 తెలంగాణ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పోటీలు హోరాహోరీగా జరిగాయి. మూడురోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారిణులు, కోచ్, మేనేజర్స్ పాల్గొన్నట్లు స్టేట్ బాక్సింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ బాక్సర్ శీలం పార్థసారథి తెలిపారు.
వీరికి హనుమకొండ ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో భోజన తదితర సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ బాక్సింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాడ సుభాష్‌రెడ్డి, ఏఈ శ్యాంప్రసాద్, ఎస్జీఎఫ్ హనుమకొండ సెక్రటరీ దస్రూనాయక్, టీజీపీఈటీఏ స్టేట్ సెక్రటరీ బోగి సుధాకర్, టీజీపీఈటీఏ వరంగల్ ప్రెసిడెంట్ గోగు నారాయణ, ఒలింపిక్ అసోసియేషన్ వరంగల్ మాజీ సెక్రటరీ మంచా ల స్వామిచరణ్, బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతరాజు రాజేందర్, బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ పెద్దమ్మ నర్సింహరాములు, హనుమకొండ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శీలం రాజేశ్వరి పాల్గొన్నారు.