కేసముద్రం, నవంబర్ 2: క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం రాష్ట్ర స్థాయి ఎస్జీ ఎఫ్ఐ బాస్కెట్‌బాల్ పోటీలను భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రూ.2కోట్లతో పాఠశాల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. క్రమశిక్షణతో ఆట లు ఆడాలన్నారు. ప్రతి విద్యార్థికి ఏదైనా సాధించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తే సాధిస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు అన్నారు. పది మందిలో ఒక్కరిగా కాకుండా ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని సూచించారు. పట్టుదలతో ప్రయత్నించి విజయం పేదరికాన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే మురళీనాయక్ సూచించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉద్యోగ ఉంటాయని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగించొద్దన్నారు. మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ప్రధానోపాద్యాయులు రాజు, నరేందర్, కార్యదర్శి రావుల మురళి, సింగిల్ విండో వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్రావు, అంబటి మహేందర్‌రెడ్డి, గుగులోత్ దస్రూనాయక్, బండారు వెంకన్న ఉన్నారు. విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.