ఖిలావరంగల్, మార్చి 28: శివనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాయంలో రేపటి (ఆదివారం) నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి నవరాత్రోత్సవాలు జరుగుతాయని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం శివనగర్‌లోని ఆలయంలో పుష్కరా కాల కుంభాభిషేక మహోత్సవాలు, శ్రీ సీతారాములు కల్యాణ మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30వ తేదీన సుప్రబాత, మంగళస్నానం, శ్రీరామనవరాత్రి కలశస్థాపన, ఉగాది పంచాగ శ్రవణం, నవరాత్రి పూజ, 31 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతి రోజు నవరాత్ర పూజలు జరుగుతాయన్నారు. అలాగే 6వ తేదీన ఉదయం విశేష పూజలు, 12.5 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవా, 7వ తేదీన ఉంజలి సేవతో శ్రీ సీతారామచంద్రస్వామి నవరాత్ర మహోత్సవాలు ముగుస్తాయన్నారు.
పుష్కరకాల కుంభాభవిషేక మహోత్సవాలు
మహాగణపతి, సుబ్రహ్మణ్య, లలీతాదేవి, శవి, పంచముఖ ఆంజనేయ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి వారి పుష్కర కాల కుంభాభిషేక మహోత్సవాలు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు. 2న యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, 3వ తేదీన ప్రత్యేక పూజలు, 4వ తేదీన సుబ్రహ్మణ్య, ఆంజనేయ హోమాలు అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ వేడుకలు శ్రీ దత్త పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్ధస్వామి సమక్షంలో జరుగుతాయన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పన్నెండేళ్లకు ఒక సారి జరిగే పుష్కర కాల కుంభాభిషేక మహోత్సవాలకు హాజరై స్వామి కృపకు పాత్రులకు కావలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి చింతం యాదగిరి, సహాయ కార్యదర్శులు ఆడెపు సాంబమూర్తి, కుడికాల సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు శ్రీరాం రాజేష్, సభ్యులు వడ్నాల సదానందం, రావికంటి అశోక్, బత్తుల నవీన్కుమాచ్, మీస సత్యనారాయణ, బండి రమేష్, కుడికాల సురేందర్, టింగిలికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.