నమస్తే తెలంగాణ నెట్వర్క్: శ్రీరామనవమిని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ఆదివారం సీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. సీతారాముల వివాహానికి ఉత్సవ కమిటీల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టువస్ర్తాలు, మత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రాములోరి పెళ్లి తంతును కనులారా వీక్షించారు. అనంతరం ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. రాయపర్తి మండలంలోని రాయపర్తి, రాగన్నగూడెం, పెర్కవేడు, కొత్తూరు, కొండాపురం, ఊకల్, కాట్రపల్లి, మైలారం, జగన్నాథపల్లి, గట్టికల్, కొండూరు, బురహాన్‌పల్లి, కొలన్‌పల్లి, కేశవాపురం, కిష్టాపురం, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, తిర్మలాయపల్లిలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాలు కనులపండువగా జరిగాయి. రాయపర్తి, బురహాన్‌పల్లిలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హాజరయ్యారు.
మైలారంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సారథ్యంలో మైలారంలో మూడు వేల మందికి అన్నదానం చేశారు. మండలకేంద్రంలో స్వామి వారి కల్యాణానికి రూ. 50,116 కానుకగా అందజేశారు. ఖానాపురం మండలంలోని సీతారామచంద్రస్వామి, రంగాపురం కోదండరా మాలయం, ధర్మారావుపేట శివరామక్షేత్రంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకలకు బీఆర్ఎస్ నేతలతో కలిసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో జరిగిన వేడుకలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని అన్నదానం చేశారు. వరంగల్‌లోని కాశీబుగ్గ, లేబర్‌కాలనీ, ఓ సిటీ, ఎనుమాముల, ఎస్ఆర్నగర్, ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, పైడిపల్లి, కొత్తపేట, ఆరెపల్లిలో శ్రీరా మ నామస్మరం మార్మోగింది.
అలాగే, వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలోని శ్రీరామాలయం, పైడిపల్లిలోని శ్రీచంద్రమౌళీశ్వరస్వామి, కొత్తపేటలోని శివాలయంలో సీతారాముల కల్యాణాన్ని కనులపండుగగా నిర్వహించారు. 14వ డివిజన్లోని సుందరయ్యనగర్, రెడ్డిపాలెంలో వేడుకలు జరిగాయి. 18వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీలోని పంచముఖ నాగవీరేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. 19వ డివిజన్ ఓ సిటీ రోడ్డులోని శ్రీసీతారామాంజనేయ లక్ష్మీగణపతి అయ్యప్పస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బయ్యాస్వామి పాల్గొన్నారు.
20వ డివిజన్లోని భక్తమార్కండేయస్వామి ఆలయం, రంగనాథస్వామి ఆలయంలో కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఓసిటీలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీతారాముల పరిణయ వేడుక నిర్వహించారు. వరంగల్ 18వ డివిజన్ లేబర్‌కాలనీలోని చెన్నారెడ్డికాలనీలో నాగవిశ్వేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణంలో కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొన్నారు. అలాగే, కరీమాబాద్ పరిధిలోని 32, 33, 39, 40, 41, 42, 43 డివిజన్లలోని ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. వరంగల్ ఎల్లంబజార్‌లోని సాయిసేవాదళ్ వీధిలో సంఘం సభ్యులు రాములోరి కల్యాణం జరిపించారు.
నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట ద్వారక శ్రీవేణుగోపాల వేంకటేశ్వర స్వామి ఆల యం, శివాంజనేయస్వామి ఆలయం, వరంగల్రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం, 1వ వార్డు, కోర్టు వెనకాల, మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం, నర్సంపేట 24 వార్డుతోపాటు గురిజాల, ముగ్దుంపురం, గుంటూరుపల్లి, లక్నేపల్లి, రామవరం, భోజ్యానాయక్‌తండా, ముత్తోజిపేట, రాజపల్లి, మాదన్నపేట, కమ్మపల్లి, దాసరిపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, ఇటుకాలపల్లిలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి రామాలయం, కేశవపురం వేంకటేశ్వరాలయం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు.
వరంగల్ రామన్నపేటలోని రామలింగేశ్వరాలయం, స్టేషన్‌రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, జేపీఎన్ రోడ్డులో ని గీతామందిర్, బట్టలబజార్ బాలావేంకటేశ్వరస్వామి ఆలయం, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నల్లబెల్లి మండలంలోని నారక్కపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి తన సొంత ఖర్చులతో సీతారాముల కల్యాణం జరిపించి అన్నదానం చేశారు. పర్వతగిరి మండలం వడ్లకొండలోని రామాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే, ఏనుగల్లులోని అభయాంజనేయస్వామి, శ్రీనగర్ గ్రామంలోని రామాలయంలో వేడుకలు జరిగాయి. వర్ధన్నపేటలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన వేడుకలో అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి సంధ్యారాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నా రు. సంగెం మండలవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొండ్రాయి, ముమ్మిడివరం, ఎల్గూర్‌రంగంపేట, చింతలపల్లి, గవిచర్ల, రాంచంద్రాపురం, కాట్రపల్లి, కుంటపల్లిలో శ్రీరామ నామస్మరణ మర్మోగింది.
నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పోచమ్మమైదాన్‌లోని భాష్పాంజనేయస్వామి ఆలయం, కొత్తవాడలోని ప్రసన్నాంజనేయస్వామి, భక్త మార్కండేయస్వామి ఆలయాలు, శ్రీశృంగేరి శంకరమఠం, ఎల్బీనగరంలోని లక్ష్మీగణపతి ఆలయం, సెకండ్ డాక్టర్స్ కాలనీలోని శ్రీవరద వేంకటేశ్వరస్వామి ఆలయం, దేశాయిపేట, లక్ష్మీ మెగా టౌన్షిప్, దేశాయిపేట రోడ్డు గణేశ్‌నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం, హనుమకొండ స్నేహనగర్ కాలనీలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, విద్యారణ్యపురి విజయగణపతినగర్, ప్రశాంత్‌నగర్‌లోని రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని శస్ర్తోక్తంగా నిర్వహించారు.
అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16 డివిజన్లలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని విశ్వనాథపురం, అత్తాపురంలో కార్యక్రమాల నిర్వహణకు వ్యాపారవేత్త అల్లం కిశోర్‌రెడ్డి రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు.