జనగామ రూరల్, ఫిబ్రవరి 17: తెలంగాణ ఉద్యమకారుడు అలుపెరుగని యోధుడు, కేసీఆర్ సచ్చుడో-తెలంగాణ వచ్చుడో అన్న సంకల్పంతో ఉద్యమించిన బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను జనగామలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు చినబోయిన రేఖ.. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ 71 వ జన్మదినం సందర్భంగా 71 నిమ్మకాయల దండ అమ్మవారి మెడలో వేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.