రఘునాథపల్లి : ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా జరుగుతున్నది. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, జనగామ రూరల్ సీఐ ఎడవల్లి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ పర్యవేక్షించారు.
రఘునాథపల్లి మండలంలో మొత్తం 47 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మధ్యాహ్నం 12.20 గంటల వరకు 23 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు.