హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సీతారామచంద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ( Kalyana Brahmotsavams ) వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు చెరుకుపల్లి శ్రీవాత్సవచార్యులు ఆధ్వర్యంలో స్వామివార్లకు పూజాకార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఊంజల్ సేవ( Unjal Seva ) నిర్వహించారు.
శ్రీ భద్రాద్రి రామునిగా ఉత్సవమూర్తులను అలంకరించి నిరాజనం మంత్రపుష్పములు సమర్పించారు. యాగశాలలో విశ్వక్సేన నవగ్రహ, తెల్లనువ్వులు, నవధాన్యాలతో వివిధ రకాల ఫలపుష్పాలతో మహాసుదర్శనయాగం, లోకకళ్యాణార్థం భక్తులకు సుదర్శన హోమం నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో తమిళనాడు ఆర్ఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ అడ్వకేట్ శ్రీధర్‌మూర్తి, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఎస్.ముఖేష్, తిరుమూర్తి, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, వందలాది మంది భక్తులు సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీరామ సేవా సమితి ట్రస్టు సభ్యుడు కట్ల రాజు పాల్గొన్నారు.